: ఉత్క‌ళ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 15కి పెరిగిన మృతుల సంఖ్య.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్‌లో ఖ‌తౌలి వ‌ద్ద జ‌రిగిన ఉత్క‌ళ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 15కి పెరిగింది. గాయ‌ప‌డిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ ప్ర‌మాదంపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్పందిస్తూ.. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న త‌న‌కు బాధ క‌లిగించింద‌ని అన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం అవ‌స‌ర‌మైన అన్ని స‌హాయ‌క చ‌ర్య‌లు తీసుకుంటున్నాయ‌ని తెలిపారు.

రైలు ప్ర‌మాద బాధితుల‌కు రైల్వే శాఖ ప‌రిహారం ప్ర‌కటించింది. మృతుల కుటుంబాల‌కు రూ.3.5ల‌క్ష‌ల చొప్పున, గాయ‌ప‌డ్డ‌వారికి రూ.50 వేల చొప్పున అందిస్తామ‌ని తెలిపింది. రైలు ప్రమాద ఘటనపై తాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడానని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. 

More Telugu News