: గోరఖ్‌పూర్‌లో 105కి చేరిన పిల్లల మరణాలు.. ఆసుపత్రికి వెళ్లిన రాహుల్ గాంధీ!

ఉత్తరప్రదేశ్ గోర‌ఖ్‌పూర్‌లోని బాబా రాఘవ దాస్ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న‌ చిన్నారుల్లో ఈ నెల‌ 10 నుంచి 11 వరకు 48 గంటల్లో 30 మంది ఆక్సిజన్ అందక మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాతి రోజుల్లో కూడా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో మరో 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయార‌ని ఆ ఆసుప‌త్రి వైద్యులు ప్ర‌క‌టించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మృతిచెందిన‌ చిన్నారుల సంఖ్య 105కి చేరింది. ఈ 11 మంది చిన్నారులు నియోనాటల్ (నవజాత శిశువు), ఏన్సెఫలైటిస్ (మెదడు వాపు వ్యాధి), సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు వివ‌రించారు. కాగా, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అక్క‌డ‌కు వెళ్లారు. మ‌రోవైపు ఈ రోజే ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆసుప‌త్రిని సంద‌ర్శించే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

More Telugu News