sridevi: శ్రీదేవి వేడుకలో సెలబ్రిటీల సందడి!

శ్రీదేవి ... తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషా ప్రేక్షకుల్లో ఈ పేరు తెలియని వాళ్లుండరు. బాలనటిగా మొదలైన ఆమె ప్రయాణం అగ్రకథానాయిక స్థానాన్ని అందుకునే స్థాయికి చేరుకుంది. బాలీవుడ్లో చాలా అరుదైన స్థానాన్ని ఆమె యేళ్ల తరబడి యేలేశారు. రీ ఎంట్రీ లోను ఆమె తన నటనలో గానీ .. తనపై ప్రేక్షకుల ఆదరణలోగాని ఎలాంటి మార్పు లేదని నిరూపించారు.

 అలాంటి శ్రీదేవి ఈ నెల 13వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. శ్రీదేవి ఫేవరేట్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన ఇంట్లో శ్రీదేవి బర్త్ డే వేడుకను నిర్వహించాడు. ఈ వేడుకకి కరణ్ జొహార్ .. షబానా అజ్మీ .. రేఖ .. టీనా అంబాని .. ఐశ్వర్య రాయ్ .. విద్యాబాలన్ .. రాణి ముఖర్జీ తదితరులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీదేవితో తమకి గల అనుబంధాన్ని గురించి ముచ్చటించుకున్నారు. ఆ తరువాత అంతా కలిసి ఫోటోలకు పోజులిస్తూ సందడి చేశారు.   

More Telugu News