: చివరి సారి అభిమానుల కోసం పరుగెత్తాలని భావించాను... మోసం చేయలేదు...సాక్ష్యం ఇదిగో: ఉసేన్ బోల్ట్

లండన్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించి కెరీర్ కు ముగింపు పలకాలన్న జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఆశలు గాయం కారణంగా అడియాసలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేసు మధ్యలో ఉసేన్ బోల్ట్ కు నిజంగా గాయమైందా? లేక ఇంకేదైనా కారణముందా? అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీటిపై ఆవేదన చెందిన ఉసేన్ బోల్ట్ సోషల్ మీడియాలో తన గాయానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను ఉంచాడు.

దానిపై మాట్లాడుతూ, ‘‘గాయం వల్ల రేసు పూర్తి చేయలేకపోయాను. కోలుకోవడానికి మూడు నెలల సమయం పడుతుంది. సాధారణంగా నా వైద్య నివేదికలను వెల్లడించను. కానీ గాయం నిజం కాదంటూ వస్తున్న వదంతులకు ముగింపు పలకాలనే ఇలా చేస్తున్నా. నా అభిమానులను నేనెప్పుడూ మోసం చేయాలని అనుకోలేదు. ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్స్‌షిప్స్‌లో చివరి సారిగా నా అభిమానుల కోసం పరిగెత్తాను. మీ మద్దతుకు ధన్యవాదాలు. గాయం మానేంత వరకూ విశ్రాంతి తీసుకుని తరువాత కొత్త జీవితానికి స్వాగతం పలుకుతాను’’ అని ట్వీట్‌ చేశాడు. దీనికి అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. పలువురు అభిమానులు విమర్శకులపై విరుచుకుపడ్డారు. 

More Telugu News