: 'వేదనిలయం' మా వారసత్వ ఆస్తి.. స్మార‌కంగా మార్చే అధికారం మీకు లేదు!: జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప

తమిళనాడు దివంగ‌త ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచార‌ణ జ‌రిపిస్తామని, పోయెస్ గార్డెన్‌లోని ఆమె నివాసమైన వేదనిలయాన్ని ఆమె స్మారకంగా మారుస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప‌ళ‌నిస్వామి ఈ రోజు ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప స్పందించారు.

పోయెస్ గార్డెన్‌లోని జ‌య‌ల‌లిత నివాసాన్ని స్మార‌కంగా మార్చే అధికారం పళనిస్వామికి లేదని అన్నారు. అది తమ వారసత్వ ఆస్తి అని అన్నారు. పళనిస్వామి తన పదవిని కాపాడుకునేందుకే విచారణ కమిటీ వేశారని వ్యాఖ్యానించారు. తాము పోయెస్ గార్డెన్ లోని ఆ నివాసాన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ వ‌దులుకోబోమ‌ని తేల్చి చెప్పారు.

More Telugu News