dhanush: మళ్లీ సీక్వెల్ కి ధనుష్ తయారు!

ధనుష్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'విఐపి' ఒకటి. కథాకథనాల పరంగా .. వసూళ్ల పరంగా ఈ సినిమా ఆయన కెరియర్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. దాంతో ఆయన 'విఐపి 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ నెల 11న తమిళంలో విడుదలైన ఈ సినిమా, మొదటివారంలో 25 కోట్లను వసూలు చేసింది.

తన కెరియర్లో ఇవి అత్యధిక వసూళ్లని ధనుష్ చెబుతున్నాడు. ఈ సినిమా సక్సెస్ తనకి మరింత ఆనందాన్ని ఇచ్చిందనీ, ఈ ఉత్సాహంతో 'విఐపి 3'కి కూడా శ్రీకారం చుట్టే ఆలోచన ఉందని అన్నాడు. తెలుగులో ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. 'రఘువరన్ బీటెక్ ' మాదిరిగానే, ఈ సీక్వెల్ కి కూడా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందిస్తారేమో చూడాలి.      

More Telugu News