ajith: హాలీవుడ్ స్థాయిలో అదరగొట్టేస్తోన్న 'వివేగం' ట్రైలర్

కోలీవుడ్ అగ్రకథానాయకులలో అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తాజా చిత్రమైన 'వివేగం' గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అక్షర హాసన్ ఓ ముఖ్యమైన పాత్రను పోషించింది. ఇక విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు.

 తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. విదేశీ లొకేషన్లు .. దట్టమైన అడవులు .. మంచు కొండల్లోని యుద్ధాలు ఆశ్చర్య చకితులను చేసేలా వున్నాయి. విజువల్స్ .. స్టంట్స్  .. ఛేజింగ్స్ ఇవన్నీ చూస్తుంటే, హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమాను తెరకెక్కించి ఉండొచ్చనిపిస్తోంది. ఈ ట్రైలర్ తో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోవడం ఖాయమని చెప్పొచ్చు.

      

More Telugu News