: గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ లోని 16 పబ్బులకు సిట్ నోటీసులు

మాదకద్రవ్యాల కేసులో విచారణను సిట్ మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో 16 పబ్బులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పబ్బుల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయని గతంలోనే గుర్తించిన సిట్ అధికారులు ఇదివరకు ఒకసారి కొన్ని పబ్బులను విచారణకు పిలిచారు. మరికొన్ని పబ్బుల యజమానులను పిలిచి హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు పెట్టని, పెట్టినా ఆఫ్ చేసే ప్రతి పబ్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు.

సీసీ కెమెరాలకు పవర్ ఎందుకు కట్ చేస్తున్నారు? కెమెరాలు పని చెయ్యకుండా ఎందుకు చేస్తున్నారు? వంటి ప్రశ్నలకు వివరణ ఇవ్వాలని 16 పబ్బులను ఆదేశించారు. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ పరిధిలోని ఓవర్ ద మూన్, క్లబ్ ఎక్స్ త్రీ, హైడ్రోజన్, ట్రియో ఎఫ్ క్లబ్, ఆక్వా కిస్మత్, ఓటీఎం, క్లబ్ ఆర్, హై లైఫ్, బీటీఎం ఎయిర్ లైన్ తదితర పబ్ లకు నోటీసులు జారీ చేశారు. అలాగే కొన్ని పబ్ ల లైసెన్సులు రద్దు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

More Telugu News