'ఉయ్యాలవాడ'కు రెహ్మాన్ సంగీతం?

17-08-2017 Thu 12:29
మెగాస్టార్ అభిమానులంతా ఆయన పుట్టినరోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజున 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనుండటం కూడా వాళ్ల ఆత్రుతకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో అమితాబ్ ఒక కీలకమైన పాత్ర చేయడానికి అంగీకరించడం .. కథానాయికగా నయనతార గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట.

 ఇక కన్నడ స్టార్ సుదీప్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేయనున్నాడనే వార్త కూడా నిజమేనట. భారీ స్థాయిలో .. జాతీయ స్థాయిలో ఈ సినిమాను చేస్తున్నారు గనుక, సంగీత దర్శకుడిగా ఎ.ఆర్. రెహ్మాన్ ను తీసుకోవాలని చూస్తున్నారు. ఆయనని సంప్రదించడం కూడా జరిగింది. అయితే ఇంకా ఆయన ఏ విషయమూ తేల్చలేదట. ఆయన ఒక్కడి విషయమే డౌట్ గా ఉందని చెప్పుకుంటున్నారు.