: స్మార్ట్ ఫోన్ దొంగతనం ఇంత సులువా?... ఢిల్లీ వాసికి ఎదురైన అనుభవం... వీడియో చూడండి!

తన కారులో వెళుతూ, ఫోన్ ను పక్క సీట్లో పెట్టుకున్న వ్యక్తి దృష్టిని మరల్చిన ఇద్దరు యువకులు, అతని ఫోన్ ను ఎంత చాకచక్యంగా దొంగిలించారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. కారు డ్యాష్ బోర్డులో అమర్చిన కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలను బాధితుడు అవిని అంబుజ్ శంకర్ సోదరి దక్షా జైద్కా తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకోగా, వేల మంది దీన్ని షేర్ చేసి, మిగతా వారిని హెచ్చరిస్తున్నారు. ఈ దొంగలు ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులకు పట్టివ్వాలన్న ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది.

ఈ ఘటన పూర్వపరాల్లోకి వెళితే... ఈ నెల 2వ తేదీన అంబుజ్ తన కారులో ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రాంతంలో వెళుతున్నాడు. ఆ సమయంలో ట్రాఫిక్ అధికంగా ఉంది. నిదానంగా కారు వెళుతున్న వేళ, ఏదో వాహనం తన కారును ఢీకొన్న శబ్దాన్ని అంబుజ్ విన్నాడు. తాను ఎవరికైనా డ్యాష్ ఇచ్చానా అన్న అనుమానంలో ఉన్న వేళ, ఓ యువకుడు ఎడమవైపు విండో వద్దకు వచ్చి, అద్దం తీయాలని కోరాడు. అద్దాన్ని తీసేంతలో, కుడివైపునకు మరో యువకుడు వచ్చి అద్దం దించాలని అడిగాడు. కుడివైపు అద్దాన్ని దించేంతలో, ఎడమవైపున్న వ్యక్తి సెకనులో సీటుపై ఉన్న స్మార్ట్ ఫోన్ దొంగిలించి, అంతే వేగంగా వెళ్లిపోయాడు. మరో యువకుడు కూడా మాయమయ్యాడు. అప్పుడు ఏం జరిగిందో అర్థం కాని అంబుజ్, ఆ తరువాత కెమెరాను పరిశీలించగా విషయం అర్థమైంది. తనకు ఎదురైన అనుభవాన్ని అందరికీ పంచుకుని, ఎవరూ ఇలా మోసపోవద్దని కోరుతున్నాడు. జరిగిన ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News