: చైనా ఫోన్ వినియోగదారులా?... అయితే కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక వినండి!

చైనా ఫోన్లకు భారత్ లో మంచి గిరాకీ...బ్రాండ్ ఏదైనా ఫర్వాలేదు, చైనా ఫోన్ ఇవ్వండి అనే వారు పెరిగిపోతున్నారు. ఎందుకంటే తక్కువధరకే ఎక్కువ ఫీచర్లతో చైనా ఫోన్లు ఆట్టుకుంటున్నాయి. యూజ్ అండ్ త్రో తరహాలో ఉండే చైనా ఫోన్లు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ ఫీచర్లతో అందుబాటులో ఉండడంతో వాటి పట్ల భారతీయులు విశేషమైన అభిమానం చూపుతున్నారు. అన్ బ్రాండ్ తో పాటు బ్రాండెడ్ చైనా ఫోన్లు కూడా భారతీయ విపణిని ఆక్రమించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఫోన్ కంపెనీలకు జారీ చేసిన నోటీసులు వినియోగదారులను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి.

దిగ్గజ మొబైల్‌ సంస్థ ‘యాపిల్‌’ సహా షియోమీ, వివో, ఒప్పో, జియోనీ, శాంసంగ్, మైక్రోమ్యాక్స్ వంటి 21 స్మార్ట్ ఫోన్ సంస్థలకు కేంద్ర ‌ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో ‘‘ఈ నెల 28 లోపు మీ సంస్థ తయారు చేసిన స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న వారి సమాచార భద్రతకు మీరు తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలి’’ అని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, చైనా ఫోన్ల కంపెనీలో తమ ఫోన్లలోని కాంటాక్ట్స్ వివరాలను లీక్ చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసింది. కాగా, డోక్లాం సమస్య నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ఆసక్తి రేపుతోంది. 

More Telugu News