: మంత్రుల కోసం 1000 ఎలక్ట్రిక్ కార్లు.. నవంబరులో అందుబాటులోకి..

కేంద్రమంత్రులు, సీనియర్ బ్యూరోక్రాట్ల కోసం ఎలక్ట్రికల్ కార్లు వచ్చేస్తున్నాయి. వచ్చే నవంబరు నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.  ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 4వేల చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 120-150 కిలోమీటర్లు ప్రయాణించే వెయ్యి కార్లను కొనుగోలు చేయనున్నట్టు ఎనర్జీ ఎఫిషియెన్స్ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఎండీ సౌరభ్ కుమార్ తెలిపారు. 

వచ్చే ఆరు నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. నవంబరు నాటికి మంత్రులు, ఇతర ప్రభుత్వ అధికారుల కోసం మొత్తం 400 వరకు ఈవీలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఈవీలు, డ్రైవర్లు, ఇతర నిర్వహణ బాధ్యతలను తామే తీసుకునేలా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వివరించారు. ఈ కార్లతో ప్రభుత్వ ధనం ఆదా అవడంతోపాటు కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

More Telugu News