Kruti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

*  తెలుగులో సక్సెస్ కాలేకపోయిన కన్నడ బ్యూటీ కృతి కర్బంద గత కొంత కాలంగా హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే 'రాజ్ రీబూట్' చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో హిందీ చిత్రం 'యమ్లా పగ్లా దీవానా ఫిర్ సే'లో నటిస్తోంది. ఇందులో సన్నీ డియోల్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  
*  మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న 'స్పైడర్' చిత్రాన్ని ఉత్తర భారతాన 'ఏఏ' ఫిలిమ్స్ సంస్థ పంపిణీ చేయనుంది. గతంలో 'బాహుబలి' బ్లాక్ బస్టర్ మూవీని ఈ సంస్థే అక్కడ రిలీజ్ చేసింది. ఈ చిత్రం వచ్చే నెల 27న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
*  అల్లరి నరేశ్ హీరోగా ప్రజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మేడ మీద అబ్బాయి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నిఖిలా విమల్ కథానాయికగా నటించింది.

More Telugu News