: రూ. 1600 కోట్లతో ఇండో-యూకే హెల్త్ మెడిసిటీ.. శంకుస్థాపన చేసిన చంద్రబాబు

అమరావతి పరిధిలోని ఎర్రబాలెంలో ఇండో-యూకే హెల్త్ మెడిసిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 1600 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. రూ. 17వేల కోట్లతో దేశ వ్యాప్తంగా 11 ఇండో-యూకే ఆసుపత్రులను నిర్మించాలనుకుంటున్నారని... ఇండో-యూకే ఆసుపత్రుల హెడ్ క్వార్టర్ అమరావతిలో ఉంటుందని చెప్పారు. అతిపెద్ద క్యాన్సర్ సెంటర్ ను ఇక్కడ నిర్మిస్తున్నారని, నర్సులకు శిక్షణ, పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నారని తెలిపారు. ఇండియాలో మెడికల్ ఖర్చులు తక్కువగా ఉంటున్న నేపథ్యంలో, యూరప్ దేశాల నుంచి కూడా రోగులు అమరావతికి వస్తారని చెప్పారు.

150 ఎకరాల్లో మెడిసిటీ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని... తొలి దశలో 50 ఎకరాల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మిస్తారని చంద్రబాబు చెప్పారు. లండన్ లోని కింగ్స్ కాలేజీ హాస్పిటల్ భాగస్వామ్యంతో హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తో పాటు, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.

More Telugu News