prabhas: 'సాహో' కోసం శ్రద్ధా కపూర్ కి అంత ఇస్తామన్నారా?

ప్రభాస్ హీరోగా 'సాహో' సినిమా షూటింగ్ మొదలైపోయింది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కారణంగానే మొదటి నుంచి కూడా బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనే ఆలోచనలోనే వున్నారు. కొంతమంది కథానాయికలు 7 నుంచి 8 కోట్లవరకూ అడగడంతో వాళ్లని పక్కకి పెట్టేశారు.

 ఆ తరువాత శ్రద్ధా కపూర్ తో సంప్రదింపులు జరిపి ..మొత్తానికి ఆమెను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకి ఎంత ఆఫర్ చేసి వుంటారనే ఆసక్తి అందరిలో తలెత్తుతోంది. నాలుగు కోట్లకి పైగానే ఆమెకి పారితోషికంగా ఇవ్వనున్నారనేది తాజా సమాచారం. శ్రద్ధా కపూర్ కి యూత్ లో వున్న క్రేజ్ వలన, ప్రభాస్ సరసన ఆమె సరిగ్గా సరిపోతుందని బలంగా నమ్మడం వలన .. త్రిభాషా చిత్రం కావడం వలన భారీ మొత్తాన్ని పారితోషికంగా ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు.     

More Telugu News