: కన్నడనాట పేదల కడుపు నింపనున్న 101 ఇందిరా క్యాంటీన్లు!

పేదలకు అతి తక్కువ ధరకు కడుపు నింపాలన్న ఉద్దేశంతో కన్నడ ప్రభుత్వం ప్రకటించిన ఇందిరా క్యాంటీన్లు నేడు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో రూ. 5కే అల్పాహారం, రూ. 10కి నాణ్యమైన భోజనాన్ని ఈ క్యాంటీన్లు అందించనున్నాయి. ఈ సంవత్సరం మార్చిలో బడ్జెట్ ను ప్రతిపాదిస్తున్న వేళ, సీఎం సిద్ధరామయ్య ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. నగరంలో ప్రభుత్వ స్థలం చాలా తక్కువగా అందుబాటులో ఉండటంతో మరిన్ని ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేయలేకపోతున్నట్టు అధికారులు తెలిపారు.

 పలు ప్రాంతాల్లో పార్కులు, ఆటస్థలాల్లోనే ఈ క్యాంటీన్లు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల క్యాంటీన్ కారణంగా తమకు ఓపెన్ స్పేస్ తగ్గిపోయిందని పలువురు నిరసనలకు కూడా దిగారు. ప్రభుత్వం మాత్రం తాము మంచి పని తలపెట్టామని, ఈ క్యాంటీన్లు పేదల కడుపు నింపుతాయని వ్యాఖ్యానించింది. జయనగర్ ప్రాంతంలోని కనకపాలయలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని, తొలి రోజు రాత్రి ప్రతి ఒక్కరికీ అన్ని క్యాంటీన్లలో ఉచిత డిన్నర్ ను ఏర్పాటు చేశామని నగర మేయర్ జీ పద్మావతి వెల్లడించారు.

More Telugu News