: స్వాతంత్ర్య దినోత్సవం వేళ భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన చైనా ఆర్మీ.. రాళ్ల దాడి.. తీవ్ర పెనుగులాట!

దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవం సంబరాల్లో మునిగిపోయిన వేళ డోక్లాం సరిహద్దులో మరోమారు చైనా దుందుడుకు చర్యలకు పాల్పడింది. వెస్టర్న్ సెక్టార్‌లోని లడఖ్ వద్ద అధీనరేఖ వెంబడి చైనా సైనికులు భారత్ భూభాగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు. భారత బలగాలు వీరిని విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. భారత్-చైనా సైనికులు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి కూడా దిగారు.

తూర్పు లడఖ్‌లోని ప్యాంగోంగ్ లేక్ ఉత్తర తీరం వద్ద ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. టిబెట్ నుంచి భారత్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోని మూడింట రెండొంతుల భాగాన్ని చైనా నియంత్రిస్తోంది. ఫింగర్-4, ఫింగర్-5 ప్రాంతాల్లో చొరబడేందుకు మంగళవారం ఉదయం చైనా సైనికులు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల్లోని కొందరు సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. బ్యానర్ డ్రిల్స్ అనంతరం పరిస్థితి కొలిక్కి వచ్చినట్టు అధికారులు వివరించారు.

More Telugu News