: నా కొడుకు గుర్తుకొచ్చాడు... ఇంకేమీ ఆలోచించలేకపోయాను!: సీపీ అప్పల నాయుడు

గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మిడివరంలో రెండేళ్ల చంద్రశేఖర్ ను బయటకు తీసే సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సీపీ అప్పల నాయుడు మాట్లాడుతూ, ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలతో బిజీగా ఉన్న తనకు సాయంత్రం నాలుగు దాటిన తరువాత రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడని సమాచారం అందిందని అన్నారు. విధుల్లో ఉన్న తనకు వెంటనే తన కుమారుడు గుర్తుకొచ్చాడని ఆయన అన్నారు. దీంతో క్షణం కూడా ఆలస్యం చేయలేదని అన్నారు. తమ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, ప్రజల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని అన్నారు.

తన కుమారుడు మ్యూజిక్ కు స్పందిస్తాడన్న సంగతి గుర్తుకొచ్చి, మ్యూజిక్ పెట్టమని చెప్పానని ఆయన తెలిపారు. దీంతో బాలుడిలో కదలికలు కనిపించాయని ఆయన అన్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సిబ్బంది శ్రమించారని ఆయన చెప్పారు. బాలుడు క్షేమంగా బయపడగానే పడ్డ శ్రమంతా ప్రతిఫలించిందని అన్నారు. బాలుడ్ని చూడగానే ఎవరికీ మరెలాంటి ఆలోచన రాలేదని, ఒక్కసారిగా ఉత్సాహం వెల్లివిరిసిందని ఆయన చెప్పారు. ఇందులో భాగమైన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

More Telugu News