pavan: పవన్ ఫస్టులుక్ కి ముహూర్తం ఖాయమైంది!

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడవ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకూ పూర్తయింది. క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో, అభిమానులంతా కూడా ఈ సినిమా నుంచి రానున్న ఫస్టు లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా సమాచారం. ఆ రోజున ఈ సినిమా నుంచి పవన్ స్టైలీష్ లుక్ ఒకటి వదలనున్నట్టు చెబుతున్నారు. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు. ఆ రోజున టైటిల్ తో కూడిన ఫస్టులుక్ నే వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.  

More Telugu News