Kajal: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  'కెమెరా ముందుకు వెళ్లగానే ఈ ప్రపంచాన్నే మరచిపోతాను..' అంటోంది అందాలభామ కాజల్. "నాకు డబ్బు... ఈ స్టార్ స్టేటస్ ఇవ్వని ఆనందాన్ని కెమెరా ఇస్తుంది. దాని ముందుకు వెళ్లగానే అదో అనిర్వచనీయమైన అనుభూతితో ప్రపంచాన్ని మరచిపోతాను. కెమెరా మాయలో పడిపోతాను. చేస్తున్న పాత్రలో ఒదిగిపోతాను" అని చెప్పింది.      
*  తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన 'ఆనందో బ్రహ్మ' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిన్న రాత్రి హైదరాబాదులో నిర్వహించారు. ఈ వేడుకకు ప్రభాస్ గెస్ట్ గా విచ్చేసి, యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కాగా, ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు.
*  బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా విషయంలో దర్శకుడికి పలువురి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా బోయపాటికి ఫోన్ చేసి అభినందించారట.
*  అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 18 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. సెప్టెంబర్ 2 వరకు జరిగే ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటారు. ఇందులో బన్నీ సరసన ఓ కథానాయికగా అనూ ఇమ్మానుయేల్ నటిస్తోంది. 

More Telugu News