: నేడే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభం!

తూర్పుగోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తొలి దశ సిద్ధమైంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు దీనిని ప్రారంభించనున్నారు. అనంతరం, నాగంపల్లి వద్ద పోలవరం ప్రధాన కాలువలో పైపు లైను ద్వారా నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తారు. కాగా, సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం వద్ద గోదావరి ఒడ్డున ఈ ఎత్తిపోతల స్కీమ్ ఉంది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులు పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుంది.

కనుక, పట్టిసీమ నుంచి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణానదికి పరుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఎడమ ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడం ద్వారా ఆ నీటిని ఏలేరు ఆయకట్టుకు పంపడం.. ఏలేరు రిజర్వాయర్ నుంచి విశాఖ పారిశ్రామిక అవసరాలు, మంచినీరు సరఫరా చేయడం ఈ పథకం లక్ష్యం. తద్వారా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కానుంది.

More Telugu News