: వ‌ర‌ద‌ల బారిన మూగజీవాలు... రోడ్ల మీద చేప‌లు, కాలువ‌లో ఇరుక్కున్న ఏనుగు...వీడియోలు చూడండి!

అస్సాం వ‌ర‌ద‌ల కార‌ణంగా మూగ‌జీవాలు చాలా ఇబ్బందులు ప‌డుతున్నాయి. దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ప్ర‌మాదాల అంచున చిక్కుకుంటున్నాయి. క‌జిరంగా జాతీయ పార్కులోని ఖ‌డ్గ‌మృగాల నుంచి బ్ర‌హ్మ‌పుత్రా న‌దిలోని చేప‌ల వ‌ర‌కు వ‌ర‌ద‌ల బారిన ప‌డి క‌ష్టాలు ఎదుర్కుంటున్నాయి. జాతీయ ర‌హదారుల మీదుగా వ‌ర‌ద‌లు పొంగి పొర్ల‌డంతో పెద్ద పెద్ద చేప‌లు రోడ్ల మీద చిక్కుకుపోతున్నాయి. అలాగే ఇళ్ల‌లో తాడుతో క‌ట్టేసిన పాడి ఆవులు, గేదెలు వ‌ర‌ద‌ల్లో చిక్కుకుని మ‌ర‌ణిస్తున్నాయి. ఇక వ‌న్య‌మృగాలు ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. వ‌ర‌ద‌ల కార‌ణంగా త‌ల్లి జంతువుల నుంచి పిల్ల జంతువులు వేరై దారితెన్ను తెలియ‌క కొట్టుమిట్టాడుతున్నాయి. వ‌ర‌ద‌ల కార‌ణంగా ఏర్ప‌డిన గోతుల్లో ఏనుగు వంటి పెద్ద జంతువులు చిక్కుకుని ఇబ్బందులు ప‌డుతున్నాయి. వాటి ప‌రిస్థితి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తున్న కొన్ని వీడియోలు మీకోసం....

More Telugu News