: విశాఖపట్నం భూముల వ్యవహారంలో కీలకఅడుగు.. ఒక‌రి అరెస్టు

విశాఖపట్నంలో కలకలం రేపిన భూముల వ్యవహారంలో ఏర్పాటైన సిట్ కీలక ఆధారాలు సంపాదించింది. ఈ కేసులో గ‌ణేశ్వ‌ర్‌ అనే భూముల‌ స‌ర్వేశాఖ ఇన్‌స్పెక్ట‌ర్‌ను అరెస్టు చేసి మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. గ‌ణేశ్వ‌ర్ భూముల వ్య‌వ‌హారంలో అరిలోవ త‌హ‌సీల్దారుని ప్ర‌లోభ‌పెట్టాడ‌ని తెలిపారు. త‌హ‌సీల్దారుకి కారుతో పాటు కోటి రూపాయ‌లు విలువజేసే అపార్ట్‌మెంట్ ఇస్తాన‌ని ఒప్పందం చేసుకున్నాడ‌ని అన్నారు. నకిలీ దస్త్రాలు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి వాటిని డ్రైవ‌ర్ ఇంట్లో దాచిపెట్టాడని విశాఖ సీపీ యోగానంద్ అన్నారు. ఈ భూముల‌న్నింటినీ త‌న బంధువుల‌పేరిట‌, కుమారుడి పేరిట గ‌ణేశ్వ‌ర్ రిజిస్ట్రేష‌న్ చేసుకున్నాడ‌ని తెలిపారు. గ‌ణేశ్వ‌ర్‌ను తాము హైద‌రాబాద్‌లో అరెస్టు చేశామ‌ని వెల్ల‌డించారు. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. 

More Telugu News