: 21 మంది పార్టీ నేతలను సస్పెండ్ చేసిన జేడీయూ

బీహార్ జేడీయూ పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు కొన‌సాగుతున్నాయి. ఆర్జేడీ నేత‌ల‌కు అవినీతి మ‌సి అంటుకోవ‌డంతో ఆ పార్టీతో తెగ‌దెంపులు చేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చేసి, బీజేపీతో క‌లిసి నితీశ్ కుమార్‌ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జేడీయూలోని కొంద‌రు నేత‌లు త‌మ పార్టీ అధిష్ఠానంపై మండిప‌డుతున్నారు.

దీంతో పార్టీ వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తూ జేడీయూ త‌మ పార్టీకి చెందిన 21 మంది నేత‌ల‌పై వేటు వేసింది. స‌స్పెండ్ అయిన వారిలో జేడీయూ కీల‌క నేత‌లు ఉన్నారు. మాజీ మంత్రి రామ్‌, మాజీ ఎంపీ అర్జున్ రాయ్‌, మాజీ ఎమ్మెల్యే రాజ్ కిశోర్ సిన్హా కూడా ఉన్నారు. ఇటీవ‌లే జేడీయూ రాజ్య‌స‌భ ప‌క్ష‌నేత పదవి నుంచి శ‌ర‌ద్ యాద‌వ్ ను కూడా ఆ పార్టీ తొల‌గించిన విష‌యం తెలిసిందే. 

More Telugu News