: భార‌త్, పాక్ జాతీయ గీతాలు క‌లిస్తే ఎలా ఉంటుందంటే.... వీడియో చూడండి

ఒక్క రోజు తేడాతో స్వాతంత్ర్య దినోత్స‌వాలు జ‌రుపుకుంటున్న భార‌త్‌, పాకిస్థాన్ దేశాల మ‌ధ్య అధికారికంగా ఎన్నో వివాదాలు, మ‌న‌స్ప‌ర్థ‌లు ఉండొచ్చు. కానీ ఇరు దేశాల సామాన్య ప్ర‌జ‌ల్లో చాలా మంది కోరుకునేది మాత్రం స్నేహ‌మే. ఈ విష‌యాన్ని రెండు దేశాల 70వ స్వాతంత్ర్య దినోత్స‌వాల సంద‌ర్భంగా గుర్తుచేస్తూ `వాయిస్ ఆఫ్ రామ్` అనే యువ‌కుల‌ బృందం ఓ వీడియోను త‌యారుచేశారు. ఇందులో ఇరు దేశాల‌కు కొంత‌మంది గాయ‌నీ గాయ‌కుల‌ను త‌మ త‌మ జాతీయ గీతాల‌ను ఆల‌పించ‌డం చూపించారు. కొత్త‌ద‌నం ఏంటంటే... ఈ వీడియోలో రెండు జాతీయ గీతాల‌ను క‌లిపేశారు. మొద‌ట పాకిస్థానీ జాతీయ గీతం ప‌ల్ల‌వి వ‌స్తుంది. త‌ర్వాత అదే టెంపో, ట్యూన్లో భార‌త జాతీయ గీతం వ‌స్తుంది. ఇలా జాతీయ గీతాలు పూర్త‌య్యే వ‌ర‌కు రెండింటిని క‌లిపేశారు. దీనికి `శాంతి గీతం` అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

More Telugu News