harsha: 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నాయికగా యాంకర్ శ్రీముఖి!

పలు రియాలిటీ షోల ద్వారా పేరు తెచ్చుకుని, బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంటుంది. ఈ క్రమంలో, తొలిసారిగా ఒక సినిమాలో లీడ్ రోల్ చేయడానికి ఓకే చెప్పింది. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ తొలిసారిగా దర్శకుడిగా మారుతూ, 'గుడ్ బ్యాడ్ అగ్లీ' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో శ్రీముఖి కథానాయికగా నటిస్తోంది. 1980ల నాటి వాతావరణంలో పిరీడ్ మూవీగా ఇది తెరకెక్కుతుందని, ఈ పాత్ర తన మనసుకు ఎంతో నచ్చిందని శ్రీముఖి అంటోంది. ఈ చిత్రం టైటిల్ లోగోను కూడా తాజాగా రిలీజ్ చేశారు.       

More Telugu News