: రూ.50కే శరీరాన్ని అమ్ముకుంటున్నారంటూ వివాదాస్పద రచన... నిషేధించిన జార్ఖండ్

జార్ఖండ్ రాష్ట్రంలోని సంతాల్ ఆదివాసీ తెగ సంస్కృతిని ఎత్తి చూపుతూ హన్స్ దా సోవేంద్ర శేఖర్ రాసిన పుస్తకం ‘ద ఆదివాసీ విల్ నాట్ డాన్స్’  వివాదాస్పదం కావడంతో దానిపై జార్ఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. శేఖర్ కూడా సంతాల్ వర్గీయుడే. రాంచీకి సమీపంలోని పాకూర్ లో వైద్యునిగా పనిచేసే ఆయన ఈ పుస్తకంలో ‘నవంబర్ ఈజ్ ధ మంత్ ఆఫ్ మైగ్రేషన్స్’ పేరుతో ఓ కథ రాశారు. ఇందులో ఆదివాసీ సంతాల్ మహిళ శరీరం కేవలం 50 రూపాయలు, కొన్ని బ్రెడ్ పకోడాలకు అమ్ముడు పోతోందంటూ పేర్కొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆదివాసీ సంస్కృతిని చెడ్డకోణంలో చూపించే ప్రయత్నంగా విమర్శలు వచ్చాయి. దీనిపై నిషేధం విధించాలని ప్రతిపక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా సైతం డిమాండ్ చేసింది. దీంతో సీఎం రఘుబర్ దాస్ సంచలనాత్మక పుస్తకంపై నిషేధం విధించారు.

More Telugu News