: అమితాబ్ చివర ‘బచ్చన్’ అనేది ఎలా వచ్చిందంటే..!

బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ పేరు గురించి ఆయన అభిమానులు తప్పకుండా ఓ ఆసక్తికర విషయం తెలుసుకోవాలి. ఆయన అసలు పేరు అమితాబ్ శ్రీవాస్తవ. మరి, బచ్చన్ అనే పదం ఎలా వచ్చి చేరిందంటే, దానికో కథ ఉంది. ప్రసిద్ధ హిందీ రచయిత, అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్. ఆయన అసలు పేరు హరివంశరాయ్ శ్రీవాస్తవ. ఆయనను చిన్నప్పుడు ముద్దుగా ఇంట్లో 'బచ్చన్' అని పిలుస్తుండేవారట.

దాంతో, తాను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు వెళ్లినప్పుడు తన పేరు చివర ‘బచ్చన్’ను చేర్చి హరివంశరాయ్ బచ్చన్ గా మార్చుకున్నారట. అప్పటి నుంచి ‘శ్రీవాస్తవ’ స్థానంలో ‘బచ్చన్’ అనే పదం స్థిరపడిపోయింది. దీంతో, ఆయన వారసుడు అయిన అమితాబ్ పేరు చివరన కూడా బచ్చన్ చేరిపోయింది. ఇంతకీ, బచ్చన్ అంటే అర్థమేంటో తెలుసా!.. చిన్న పిల్లాడు అని.

More Telugu News