: నిరాశతో ముగిసిన ఉసేన్ బోల్ట్ కెరీర్ .. రిలే ఫైనల్లో కుప్పకూలిన జమైకా చిరుత!

జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ తన అభిమానులను నిరాశపరిచాడు. తన అంతర్జాతీయ కెరీర్ ను బంగారు పతకంతో ముగించాలని ఆశించిన ఉసేన్ బోల్ట్ సాధించలేకపోయాడు. నిన్న రాత్రి జరిగిన 4x100 మీటర్ల రిలే ఫైనల్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. టికెండో ట్రేసీ, జూలియన్ ఫోర్టీ, మైకేల్ క్యాంప్ బెల్, ఉసేన్ బోల్ట్ లతో కూడిన జమైకా బృందం ఈ ఫైనల్లో పాల్గొంది.

కొద్ది దూరం పరుగెత్తిన వెంటనే బోల్ట్ తొడ కండరాలు పట్టేయడం, మోకాలి నొప్పి కారణంగా ట్రాక్ పైనే కుప్పకూలిపోయాడు. అయితే, బ్యాటన్ అందుకునే సరికే బోల్ట్ నేతృత్వం వహిస్తున్న జమైకా జట్టు మూడో స్థానంలో ఉంది. దీంతో, అంతర్జాతీయ కెరీర్ ను స్వర్ణపతకంతో ముగించాలనుకున్న బోల్ట్ కలలు కల్లలయ్యాయి. ఈ పోటీల్లో ఎటువంటి పతకమూ సాధించకుండానే బోల్ట్ కెరీర్ ను ముగించినట్టయింది. కాగా, 4x100 మీటర్ల రిలేలో వరుసగా ఐదో పతకాన్ని సాధించేందుకు బోల్ట్ చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు.

More Telugu News