raviteja: 'రాజా ది గ్రేట్' టీజర్ తో వచ్చేస్తోన్న రవితేజ!

రవితేజ ఈ ఏడాది రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. ఈ రెండింటిలో 'రాజా ది గ్రేట్' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, రవితేజ చూపులేని వ్యక్తిగా కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ వచ్చి చాలా కాలమే అయింది. దాంతో రవితేజ అభిమానులంతా టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ పై రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా అలరించనుంది.    

More Telugu News