nagarjuna: కోలీవుడ్ లో రిలీజ్ కానున్న నాగ్ మూవీ!

రాఘవేంద్రరావు .. నాగార్జున కాంబినేషన్లో వచ్చిన భక్తిరస చిత్రాలలో ' ఓం నమో వేంకటేశాయ' ఒకటి. వేంకటేశ్వర స్వామికి మహా భక్తుడైన 'హథీ రామ్ బావాజీ' జీవితచరిత్ర ఇది. ఈ భక్తిరస చిత్రాన్ని రాఘవేంద్రరావు తనదైన శైలిలో తెరకెక్కించాడు. ఈ సినిమాలో భక్తుడిగా నాగ్ లుక్ అదిరింది అన్నారు. కానీ ఎందుకనో ఈ సినిమా ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆడలేదు.

 అయితే ఈ సినిమాను డబ్ చేసి తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం. హథీ రామ్ బావాజీ గురించిన చరిత్ర తమిళ ప్రజలకు తెలుసునట. అందువలన ఈ సినిమాను అనువాదంగా అక్కడ రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇక తమిళంలో ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.   

More Telugu News