: ఉత్తర కొరియా క్షిపణులు కేవలం 14 నిమిషాల్లో ఆ ప్రాంతానికి చేరుకోగలవట!

అమెరికా, ఉత్త‌ర‌కొరియాల మ‌ధ్య యుద్ధం జ‌రిగే విధంగా ప‌రిస్థితులు నెల‌కొంటుండ‌డంతో ఇరు దేశాల బ‌లాబ‌లాల గురించి విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అమెరికా అధీనంలో ఉన్న గువామ్ ద్వీపంపై భీక‌ర‌దాడి చేస్తామ‌ని ఇటీవ‌ల ఉత్త‌ర‌కొరియా ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో ఆ ప్రాంత హోమ్‌లాండ్‌ భద్రతా ప్రతినిధి జెన్నా మాట్లాడుతూ.. అక్క‌డి అన్ని ప్రాంతాల్లో హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు.  

గువామ్‌పై ఉత్తర కొరియా క్షిపణులతో దాడి చేస్తే అవి కేవలం 14 నిమిషాల్లోనే చేరుకొని ఆ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తాయని అన్నారు. ఈ క్రమంలో ఆ  ప్రాంత‌ ప్రజలను భ‌ద్ర‌తా సిబ్బంది అప్రమత్తం చేశారని తెలిపారు. ఒక్క‌సారిగా అనుకోని ఘ‌ట‌న‌లు జ‌రిగితే అక్క‌డి వారిని 15 హెచ్చరిక వ్యవస్థల ద్వారా అప్రమత్తం చేస్తామని అన్నారు. ఆ ప్రాంతాల్లో సుమారు 7 వేల మంది భ్రదతా సిబ్బంది ఉన్నారు.    

More Telugu News