sundeep kishan: 'మాయవన్' ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్!

తెలుగులో సందీప్ కిషన్ చేస్తోన్న సినిమాలు వరుసగా ఆయనని నిరాశ పరుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తమిళంలో 'మాయవన్' అనే సినిమా చేశాడు. ఒక సైకో వరుస హత్యలు చేస్తూ వెళుతుంటే .. అతణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ గా సందీప్ కిషన్ ఈ సినిమాలో కనిపించనున్నాడు.

 రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ద్వారా సి.వి.కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నా, ఎక్కడా కూడా కొత్త దర్శకుడని అనిపించదు. ఇక లావణ్య త్రిపాఠి తమిళంలో చేస్తోన్న ఫస్టు పిక్చర్ ఇదే కావడం విశేషం. ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను, 'ప్రాజెక్ట్ జెడ్' పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు.

   

More Telugu News