nani: నాని మూవీ షూటింగ్ కి పర్మిషన్ రాలేదట!

ప్రస్తుతం నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ జరుపుకుంది. ఈ సినిమా తరువాత నాని .. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి వుంది. కానీ ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదని హను రాఘవపూడి చెబుతున్నాడు.

కథ ప్రకారం ఈ సినిమాలో నాని ఆర్మీలో చేసే యువకుడిగా కనిపించనున్నాడు. ఈ కారణంగా ఈ సినిమాలో కొంత భాగాన్ని లడఖ్ లో చిత్రీకరించవలసి వుంది. అయితే అక్కడ షూటింగ్ చేయడానికి ఇప్పట్లో అనుమతులు ఇవ్వలేమని సంబంధిత అధికారులు చెప్పారట. వచ్చే ఏడాది మే లో సంప్రదించమని అన్నారట. అందువలన ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యం కానుందని అన్నాడు. మరో హీరోతో మరో మూవీ ప్లాన్ చేస్తున్నాననీ, ఆ హీరో ఎవరన్నది త్వరలో తెలియజేస్తానని చెప్పాడు.      

More Telugu News