mahesh babu: మహేశ్ లేకుండానే 'నిజం' సీక్వెల్?

దర్శకుడు తేజ .. ప్రేమ కథలకి పెట్టింది పేరు. అయితే ఆయన కెరియర్లో 'నిజం' లాంటి ఆలోచింపజేసే సినిమాలు కూడా వున్నాయి. అమాయకుడైన కథానాయకుడిని పరిస్థితులు ఎలా మార్చేశాయనే విషయాన్ని ఈ సినిమాలో ఆయన అద్భుతంగా చూపించాడు. ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, మహేశ్ కెరియర్లో ఇదొక ప్రత్యేకమైన సినిమా అనే చెప్పాలి.

 అలాంటి సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో తేజ వున్నాడని సమాచారం. అయితే ఈ సారి ఈ సినిమాలో మహేశ్ ఉండడు. కొత్త కుర్రాడితో గానీ .. ఓ మాదిరి హీరోతో గాని ఆయన ఈ సీక్వెల్ చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ సీక్వెల్ కి 'ఇది నిజం కాదు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. 

More Telugu News