: పింక్ డాల్ఫిన్ ను ఎప్పుడైనా చూశారా?... ఈ వీడియోలో చూడండి!

పింక్ డాల్ఫిన్స్ ను ఎప్పుడైనా చూశారా? సముద్రంలో అత్యంత అరుదుగా కనిపించే పింక్ డాల్పిన్ అమెరికాలోని లూసియానా సముద్ర తీరంలో క‌నిపించింది. పింకీ అని స్థానికులు ముద్దుగా పిలిచే ఈ డాల్ఫిన్ వేగంగా వెళ్తున్న షిప్ ముందు సరదాగా దూకుతూ సందడి చేసింది. దీనిని వేరే షిప్ లో ఉన్నవారు వీడియో తీశారు. ఈ వీడియోలో వేరే డాల్పిన్లతో కలసి సరదాగా వెళ్తున్న పింకీని చూడచ్చు. ఈ పింకీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. దీనిని నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ పింక్ దాల్ఫిన్స్ అరుదైనవని పరిశోధకులు చెబుతున్నారు. 

More Telugu News