rana: తేజ కష్టానికి అన్నీ అలా కలిసొచ్చాయంతే!

చాలాకాలం క్రితం ప్రేమకథా చిత్రాలతో తేజ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఆ తరువాత చాలామంది దర్శకులు ఆ తరహా సినిమాలు చేసేలా నిలిచాడు. ఆ తరువాత మాత్రం ఆయన నుంచి వరుస పరాజయాలు రావడం మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే 'అహం' పేరుతో తేజ ఒక కథను సిద్ధం చేసుకున్నాడు.

 ఆయన ఇచ్చిన పరాజయాలను పక్కన పెట్టి భరత్ చౌదరి .. కిరణ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. ఆ తరువాత కొంత రష్ చూశాక సురేశ్ బాబు కూడా మరో నిర్మాతగా జాయిన్ అయ్యారు. ఆయన చేయి పడటంతో ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. అందరూ కలిసి సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్ కలిగేలా చేయగలిగారు. భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకు తీసుకురాగలిగారు. తేజ కష్టానికి అన్నీ అలా కలిసొచ్చాయంతే.

More Telugu News