: చైనాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. మండిపడుతున్న చైనా!

స్ప్రాట్లీ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న‌ చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అగ్ర‌రాజ్యం అమెరికా కీల‌క నిర్ణ‌యం తీసుకుని ఆ దేశాన్ని హెచ్చ‌రించింది. చైనా తన దీవులుగా చెప్పుకొంటున్న ఆ ప్రాంతాల‌కి సమీపంలోకి విధ్వంసక నౌకను పంపింది. ఇటీవ‌లే అమెరికా అధీనంలోని గువామ్ పై భీక‌ర దాడి చేస్తామ‌ని ఉత్త‌ర‌కొరియా హెచ్చ‌రిక‌లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అమెరికా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఉత్తర కొరియాకు చైనా మ‌ద్ద‌తుగా నిలిస్తే ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఉత్త‌ర‌ కొరియా విషయంలో చైనా త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందేన‌ని పేర్కొంది.  

స్ప్రాట్లీ దీవుల్లో మలేషియా, ఫిలీప్ఫిన్స్, తైవాన్, వియత్నాం, బ్రూనై దేశాలకు కూడా హ‌క్కులు ఉంటాయి. కానీ, చైనా ఆ దీవుల‌పై త‌మ ఆధిప‌త్యాన్ని నిల‌బెట్టుకుంది. ఈ దీవులు సైనికపరంగా ఎంతో కీలకమైనవి కావ‌డం, ప్రతీ ఏడాది ఆయా ప్రాంతాల మేర‌ 3.85 ట్రిలియన్ పౌండ్ల మేర నౌకా వాణిజ్యం జరుగుతుండడంతో చైనాకు ఈ దీవులు ఎంతో ముఖ్య‌మైన‌వి. ఈ దీవుల సమీపం గుండా చైనా నౌకలు వెళ్లకుండా అమెరికా నిరోధిస్తే చైనా ఎంతో న‌ష్టం వాటిల్లుతుంది. విధ్వంస‌క నౌక‌ల‌ను పంప‌డం ద్వారా చైనా ఆధిపత్యాన్ని అమెరికా సవాల్ చేసింది. ఈ విష‌యంపై చైనా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఉత్త‌ర‌కొరియా, చైనా, అమెరికా, భార‌త్ చుట్టూ వివాదాలు చెల‌రేగుతుండ‌డంతో మూడో ప్ర‌పంచ యుద్ధం జ‌రిగే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.     

More Telugu News