bellamkonda: షాకిస్తోన్న 'జయ జానకి నాయక' శాటిలైట్ రైట్స్!

భారీస్థాయిలో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న చిత్రాల్లో 'జయ జానకి నాయక' కూడా వుంది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి జరిగిన శాటిలైట్ బిజినెస్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

 ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను 'స్టార్ మా' వారు 5 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక హిందీ డబ్బింగ్ వెర్షన్ హక్కులను 7 కోట్లకు సోని నెట్ వర్క్ వారు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 'జయ జానకి నాయక' టైటిల్ .. కథా కథనాలను బట్టి చూస్తే, యూత్ ను .. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేదిలా వుంది. అందువలన ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ ఈ రేంజ్ లో జరిగిందని అంటున్నారు. హిందీ వెర్షన్ 'సరైనోడు' కి వచ్చిన టీఆర్పీలు కూడా ఈ స్థాయి రేటు పలకడానికి కారణమని చెప్పుకుంటున్నారు

More Telugu News