: అడ్డంగా బుక్కైన పీకే.. అడ్డదారుల్లో పని చేస్తున్న జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్?

జగన్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీలపై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయి. ప్రజాధనంతో చంద్రబాబు అమరావతిలో ఇల్లు కొనుక్కోబోతున్నారని.. తన అనుభవాన్ని రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు వినియోగిస్తున్నారని... చంద్రబాబు దళితులను మోసం చేస్తున్నారని... ముఖ్యమంత్రి అన్ని మతాలను గౌరవించాలని... ఇలా అనేక పోస్టింగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా ఇలాంటి వ్యతిరేక ప్రచారం పెరిగిపోవడంతో టీడీపీ నేతలకు సందేహం వచ్చింది. దీంతో, ఈ పోస్టింగులపై ఆరా తీయడం ప్రారంభించారు. దీంతో, అసలు విషయం బయటపడింది.

ఇలాంటి పోస్టింగులు పెడుతున్న వారంతా అరోరా, గోస్వామి, మెహతా, గొగోయ్ తదితర పేర్లతో ఉన్నావారే. అంటే వీరంతా ఉత్తర భారతానికి సంబంధించిన వారు. దీంతో, మరింత లోతుగా వెళ్లి చూస్తే, అసలు విషయం బయటపడింది. గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ పంజాబ్, యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా వ్యవహరించారు. అప్పట్లో కూడా ఆయన ఇలాగే వేల సంఖ్యలో ఖాతాలు తెరిపించారు. తమ వ్యూహాలకు అనుగుణంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి ఈ ఖాతాల ద్వారా పోస్ట్ లు చేస్తూ వచ్చారు.

ఇప్పుడు టీడీపీని ఎదుర్కొనే క్రమంలో కూడా పీకే ఇదే వ్యూహాన్ని ఎంచుకున్నారు. అయితే, ఒక్క పొరపాటు వల్ల ఆయన అడ్డంగా బుక్కైయ్యారు. ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టంగ్ పెడుతున్న వారి అకౌంట్లు యూపీ, పంజాబ్ ఎన్నికల్లో కూడా ఉపయోగించినవే. ఆ ఎన్నికల సమయంలో వారు పెట్టిన పోస్టింగ్ లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దీంతో, ఆపరేషన్ పీకే బట్టబయలైందని ఓ టీడీపీ నేత అన్నారు. ఇప్పటికే 40 నుంచి 50 వేల సోషల్ మీడియా అకౌంట్లను పీకే గ్యాంగ్ తెరిచినట్టు తెలుస్తోందని ఆయన చెప్పారు. అడ్డదారుల్లో పనిచేస్తున్న పీకే వ్యవహారాన్ని ముందుగా ప్రజల్లోకి తీసుకెళతామని... ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

More Telugu News