prabhas: రెండేళ్లయితే ఓకే .. నాలుగేళ్లయితే నా వల్ల కాదు : ప్రభాస్

'బాహుబలి' సినిమా కోసం ప్రభాస్ దాదాపు నాలుగేళ్ల సమయాన్ని కేటాయించాడు. ఈ సమయంలో ఆయన 8 సినిమాల వరకూ చేయవచ్చు. అయితే అన్ని సినిమాలు హిట్ అయితే ప్రభాస్ కి ఎంత క్రేజ్ వచ్చి ఉండేదో .. ఒక్క 'బాహుబలి' హిట్ తో ఆయనకి అంతటి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా నేషనల్ స్టార్ గా ఆయనకి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది.

 అలాంటి కథతో మరో భారీ ప్రాజెక్టు వస్తే .. మళ్లీ నాలుగేళ్లు కేటాయించడానికి సిద్ధమేనా? అనే ప్రశ్న ఆయనకి ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక నుంచి ఎదురైంది. ఓ నటుడి కెరియర్లో నాలుగేళ్ల సమయం చాలా విలువైనదని ప్రభాస్ అన్నాడు. 'బాహుబలి' కోసం అంతటి సమయాన్ని కేటాయించడానికి కారణం రాజమౌళిపై గల నమ్మకమని చెప్పారు. ఆ స్థాయి ప్రాజెక్టుతో ఎవరైనా వస్తే రెండేళ్ల సమయాన్ని కేటాయించడానికి తాను సిద్ధమనీ .. నాలుగేళ్లు పడుతుందంటే మాత్రం కష్టమని ప్రభాస్ స్పష్టం చేశాడు.    

More Telugu News