balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ ను బాలయ్య పక్కన పెట్టేశారా?

నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితచరిత్రను తెరకెక్కించనున్నట్టు ఆమధ్య బాలకృష్ణ చెప్పారు. ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తాడనే టాక్ వచ్చింది. ఎన్టీ రామారావు నట జీవితాన్ని .. రాజకీయ జీవితాన్ని వేరు వేరు భాగాలుగా తెరకెక్కిస్తారని చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు పాత్రను బాలకృష్ణ చేయాలని నిర్ణయించుకున్నారు.

 కానీ కొంతకాలం పాటు ఈ ప్రయత్నాన్ని పక్కన పెట్టేసే ఆలోచనలో ఆయన ఉన్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఎన్టీ రామారావు జీవిత చరిత్రను తెరకెక్కించాలనే ఆలోచన మంచిదే అయినా .. అది ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించేదే అయినా, కొంతకాలం పాటు ఈ ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిదని బాలకృష్ణకి ఆయన సన్నిహితులు చెప్పారట. దాంతో ఆయన ఈ ప్రాజెక్టు గురించిన ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టు చెప్పుకుంటున్నారు.   

More Telugu News