bellamkonda: ఇలాంటి కుర్రాడొకడు మన ఇంట్లోనూ ఉండాలి అంటారు : బోయపాటి

బోయపాటి తాజా చిత్రంగా 'జయ జానకి నాయక' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి బోయపాటి మాట్లాడారు. ఎప్పటి నుంచో తాను లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలనుకుంటున్నాననీ, అది ఈ సినిమాతో కుదిరిందని అన్నారు. ఈ సినిమాలో వున్నది చిన్న హీరో కనుక .. తన స్థాయిని తగ్గించుకుని సినిమా చేయలేదని చెప్పారు. ఓ 24 యేళ్ల వయసున్న కుర్రాడికి ఏ స్థాయి యాక్షన్ సీన్స్ పెడితే బాగుంటుందో ఆ స్థాయిలోనే డిజైన్ చేశామని అన్నారు.

 లవ్ సీన్స్ లోను .. యాక్షన్ సీన్స్ లోను ప్రేక్షకులు లీనమైపోతారని చెప్పారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా బాగా చేశాడనీ .. ఈ సినిమా ఆయన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని అన్నారు. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ బాగుందనీ .. డాన్స్ బాగుందనీ .. ఫైట్స్ బాగా చేశాడనీ .. డైలాగ్స్ బాగా చెప్పాడని .. ఇలా ఒక్కో అంశానికి సంబంధించి మార్కులు ఇవ్వలేరని చెప్పారు. ఓవరాల్ గా ఇలాంటి కుర్రాడొకడు మన ఇంట్లోనూ వుండాలని తేల్చి చెప్తారనీ .. అంతగా ఆ పాత్ర ప్రభావం ఉంటుందని అన్నారు.

More Telugu News