Amala Paul: అందుకే ప్రమోషన్స్ కి దూరంగా అమలా పాల్?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేసిన 'విఐపి 2' సినిమాను అక్కడ ఈ నెల 11వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అమలా పాల్ కథానాయికగా నటించగా, కీలకమైన పాత్రలో కాజోల్ కనిపించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ధనుష్ .. కాజోల్ మాత్రమే ఎక్కువగా కనిపించారు. అమలా పాల్ పెద్దగా ప్రమోషన్స్ కి హాజరు కాలేదు.

విడుదల తేదీ మరీ దగ్గర పడుతుండటంతో అమలా పాల్ అక్కడక్కడా కనిపిస్తోంది. తాను వేరే సినిమా షూటింగులో బిజీగా ఉండటం వలన, ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనలేకపోయానని చెబుతోంది. అయితే బయట మాత్రం వేరే టాక్ వినిపిస్తోంది. మొదట్లో ప్రమోషన్స్  కి అమ్మడు వచ్చినప్పుడు అంతా సుచీ లీక్స్  గురించి ప్రశ్నల వర్షం కురిపించారట. అప్పుడు అసహనాన్ని ప్రదర్శించిన ఈ సుందరి, ఆ తరువాత ప్రమోషన్స్ కి రావడం తగ్గించిందని చెప్పుకుంటున్నారు. ఇక 'విఐపి' మాదిరిగానే,'విఐపి 2' కూడా భారీ సక్సెస్ ను సాధిస్తుందేమో చూడాలి.    

More Telugu News