: 'భయపెట్టడం మాకూ తెలుసు' అంటూ ఫ్యాన్స్ కు ప్రిన్స్ మహేశ్ బాబు టీజర్ గిఫ్ట్

నేడు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మురుగదాస్ దర్శకత్వంలో, ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం 'స్పైడర్' టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. 'పెరుగుతున్న జ‌నాభాను కంట్రోల్‌ చేసేందుకు... గ‌వ‌ర్న్‌మెంట్‌, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే' అని విలన్ ఎస్ జే సూర్య చెప్పడం, 'భయపెట్టడం మాకూ తెలుసు' అన్న మహేశ్ డైలాగు, 'ఐ నీడ్ ఏ బ్లైండ్ డేట్' అంటున్న రకుల్ ప్రీత్ సింగ్ డైలాగులు ఈ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. దసరా కానుకగా రానున్న ఈ చిత్రం టీజర్ కు విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే వేల కొద్దీ క్లిక్స్ వచ్చాయి. ఈ టీజర్ ను మీరూ చూడవచ్చు.

More Telugu News