Rashi: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  తన బెస్ట్ ఫ్రెండ్స్ పుస్తకాలే.. అంటోంది టాలీవుడ్ బ్యూటీ రాశిఖన్నా. "నాకు స్నేహితులు చాలా తక్కువ మంది వున్నారు. నేను ఖాళీగా వుంటే కనుక పుస్తకాలే చదువుతూ వుంటాను. నాకు కాలక్షేపం పుస్తకాలే. ఒక విధంగా చెప్పాలంటే, నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఈ పుస్తకాలే" అని చెప్పింది రాశి.      
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న 'భరత్ అను నేను' చిత్రం తాజా షెడ్యూలు ఈ నెల 11 నుంచి యూపీలోని లక్నోలో జరుగుతుంది. పది రోజుల పాటు జరిగే ఈ షూటింగులో మహేశ్, కైరా అద్వానీ, ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొంటారు. కీలక సన్నివేశాలతో పాటు పీటర్ హెయిన్స్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా చిత్రీకరిస్తారు.
*  ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న 'నెక్స్ట్ నువ్వే' చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో వైభవి శాండిల్య కథానాయికగా నటించింది.
*  సూర్య నటించిన 'సింగం 3' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ కెమేరామెన్ రవి కె.చంద్రన్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఇందులో సన్నీ డియోల్ హీరోగా నటిస్తాడు.   

More Telugu News