gunasekhar: నెక్స్ట్ మూవీ టైటిల్ అది కాదంటోన్న గుణశేఖర్

సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ తో 'రుద్రమదేవి' చేసిన గుణశేఖర్ చాలానే టెన్షన్ పడ్డారు. ఆ సినిమా ఆయనకి మంచి పేరు తెచ్చి పెట్టడంతో, ఆర్థికపరమైన గండం నుంచి గట్టెక్కారు. ఆ తరువాత ఆయన 'భక్త ప్రహ్లాద' జీవిత చరిత్రపై తన తదుపరి సినిమా ఉంటుందని చెప్పారు. ఆ తరువాత ఈ సినిమాపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో, ఆ ఆలోచన విరమించుకున్నారేమోననే ప్రచారం మొదలైంది.

 తాజాగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఆగిపోలేదని చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అన్నారు. త్వరలోనే నటీనటుల సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఈ సినిమా టైటిల్ 'భక్త ప్రహ్లాద' కాదనీ .. టైటిల్ ఏమిటనేది త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. 'రుద్రమదేవి' తరహాలోనే ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను భారీతనంతో తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చారు.     

More Telugu News