rana: స్టార్ హీరోల జాబితాలో రానా చేరిపోవడం ఖాయం : తేజ

గతంలో తేజ చేసిన కొన్ని సినిమాలు కొత్త ట్రెండును సెట్ చేశాయి. ఈ సారి కూడా అదే జరగబోతోందని 'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్ చూసినవాళ్లు అంటున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ, ఇది కథాబలంతో కూడిన చిత్రమని అన్నారు.

సాధారణంగా ఏ సినిమాలోనైనా కథానాయకుడిలోని ఒక కోణాన్ని మాత్రమే చూపించడం జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో కథానాయకుడిలోని మంచి - చెడు అనే రెండు కోణాలను ఆవిష్కరించడం జరిగిందని చెప్పారు. ఈ సినిమాలో 'జోగేంద్ర' పాత్రను రానా అద్భుతంగా చేశాడని అన్నారు. సెట్లోకి రానా వస్తూనే తన పాత్రకి సంబంధించిన మూడ్ లో వచ్చేవారనీ .. నటన పట్ల ఆయనకి గల అంకితభావం తనకి ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఈ సినిమా తరువాత ఆయన తప్పకుండా స్టార్ హీరోల జాబితాలో చేరిపోతారని అన్నారు.      

More Telugu News