: రాజకీయ వ్యవస్థను చూసి చిరాకు పుట్టింది... రోజురోజుకీ భ్రష్టుపట్టిపోతోంది!: కొరటాల శివ

దేశంలో రాజకీయ వ్యవస్థ రోజురోజుకీ బ్రష్టుపట్టిపోతోందని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ రంగం చూసినా దినదినాభివృద్ధి చెందుతుంటే... కేవలం రాజకీయ వ్యవస్థ మాత్రమే దిగజారిపోతోందని ఆయన అన్నారు. ట్విట్టర్ లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ...రాజకీయాలు ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారిపోయాయని అన్నారు. ఈ తప్పుకు కారణం ప్రజలేనని అన్నారు. ఒక వస్తువు కొనుగోలు చేయాలంటే పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని, కానీ రాజకీయాలంటే మాత్రం పారదర్శకత ఉండదని ప్రజలంతా భావిస్తున్నారని ఆయన చెప్పారు.

గతంలో రాజకీయ పార్టీలు ప్రజలకు మంచి చేయాలని ఆలోచించేవని, ఇప్పుడలా కాదని, ఏ నిర్ణయం తీసుకుంటే రాజకీయ పార్టీలకు ఉపయోగం ఉంటుందో ప్రజలే చెప్పేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదా జరగాల్సింది? ఇదా దేశం నడవాల్సిన విధానం? ఇవా ప్రజలకు మేలు జరిగే రాజకీయాలు? అంటూ ఆయన ప్రశ్నించారు. తాను కూడా ప్రజల్లో ఒక భాగమని అందులో భాగంగానే ట్వీట్ చేశానని ఆయన చెప్పారు. 

More Telugu News