nithin: అదిరే రేటుకు 'లై' శాటిలైట్ హక్కులు!

దర్శకుడిగా హను రాఘవపూడికి మంచి ట్రాక్ రికార్డ్ వుంది. ఇక హీరోగా నితిన్ కూడా తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న 'లై' సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా వున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

 దాంతో ఈ సినిమా శాటిలైట్ హక్కులకు డిమాండ్ పెరిగిపోయింది. ఫైనల్ గా జీ తెలుగు ఛానల్ వారు .. భారీ మొత్తం చెల్లించి ఈ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకున్నట్టు చెబుతున్నారు. కొత్త కథానాయిక మేఘా ఆకాశ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ .. ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండటం మరో విశేషం.  

More Telugu News